![]() |
![]() |

బుల్లితెరపై 'కార్తీకదీపం' సీరియల్ ఓ సంచనలం. ఏ సీరియల్ కి సాధ్యం కాని టీఆర్పీ రేటింగ్స్ ఆ సీరియల్ సొంతం. స్టార్ హీరోల సినిమాలు ఉన్నా, క్రికెట్ మ్యాచ్ లు ఉన్నా, బిగ్ షోస్ ఉన్నా 'కార్తీకదీపం' రేటింగ్ కి డోకా ఉండేది కాదు. భారీ రేటింగ్ తో ఎప్పుడూ వెలిగిపోతూ ఉండేది. అయితే అదంతా మొన్నటిదాకా. ఇప్పుడు లెక్క తప్పింది. 'కార్తీకదీపం' సీరియల్ రేటింగ్ రోజురోజుకి తగ్గిపోతుంది.
'కార్తీకదీపం' సీరియల్ కి ఉన్న క్రేజ్ మరే సీరియల్ కి లేదంటే అతిశయోక్తి కాదేమో. సోషల్ మీడియాలో సైతం డాక్టర్ బాబు, వంటలక్క అంటూ ఆ సీరియల్ గురించి చర్చ జరుగుతుంటుంది. ఇతర సీరియల్స్, షోలు 'కార్తీకదీపం' రేటింగ్ అందుకోలేక ఆయాసపడుతుంటాయి. అయితే ఇప్పుడు అవసరం లేకుండా కార్తీకదీపమే వెనక్కి వచ్చేస్తోంది.
డాక్టర్ బాబు, వంటలక్క ఎప్పుడెప్పుడు కలుస్తారా? అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. డాక్టర్ బాబు, వంటలక్క కలిసిపోయారు.. మోనిత జైలు కు వెళ్ళింది అనుకున్న టైంలో.. మోనిత జైలు నుంచి తిరిగొచ్చి బిడ్డకు జన్మనివ్వడం.. మళ్లీ డాక్టర్ బాబు, వంటలక్కల మధ్య గ్యాప్ రావడం జరిగిపోయింది. ఇక అక్కడి నుంచి కథని అక్కడక్కడే తిప్పి సాగదీస్తుండటంతో ప్రేక్షకులు బోర్ గా ఫీలయ్యి 'కార్తీకదీపం' సీరియల్ ని చూడటం తగ్గిస్తున్నారట. గతంలో 18-21 మధ్య రేటింగ్ సాధించిన 'కార్తీకదీపం' ఈ వారం 14-15 కి పడిపోయిందట. సాగదీత ఇలాగే కొనసాగితే రేటింగ్ మరింత పతనమయ్యే అవకాశముందని అంటున్నారు. ఇకనైనా 'కార్తీకదీపం' టీమ్ మేల్కొని కథనంలో వేగం పెంచడమో లేక కథకి ముగింపు పలకడమో చేస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
![]() |
![]() |